సంక్షేమ పథకాలను కూడా టీడీపీ అడ్డుకుంటుంది: ధర్మాన కృష్ణదాస్

సంక్షేమ పథకాలను కూడా టీడీపీ అడ్డుకుంటుంది: ధర్మాన కృష్ణదాస్

రాజకీయ దురుద్దేశంతో శాసన మండలి వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేస్తుంటే.. టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ సదుద్దేశాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. చివరికి సంక్షేమ పథకాలను కూడా టీడీపీ దుర్బుద్ధితో అడ్డుకుంటోందని విమర్శించారు. బాలికల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో చేపట్టిన ర్యాలీలో ధర్మాన పాల్గొన్నారు. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

Tags

Next Story