మండలి రద్దు చేసినా.. ఎలాంటి అభ్యంతరం లేదు.. పార్టీకోసం పనిచేసుకుంటాం: ఎన్ఎండీ ఫరూక్

మండలి రద్దు చేసినా.. ఎలాంటి అభ్యంతరం లేదు.. పార్టీకోసం పనిచేసుకుంటాం: ఎన్ఎండీ ఫరూక్

కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మండలిలో రాజధాని మార్పు బిల్లును సెలక్షన్‌ కమిటీకి పంపడంతో ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, కర్నూలు టీడీపీ ఇంఛార్జ్‌ టీజీ భరత్‌ పాల్గొన్నారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించిన మండలి మాజీ ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఛైర్మన్‌ షరీఫ్‌ను అసభ్యకరంగా తిట్టడమే కాకుండా దాడికి ప్రయత్నించారన్నారు. జగన్‌ మండలి రద్దు చేసుకున్నా.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, పార్టీ కోసమే పని చేసుకుంటామన్నారు. రాయలసీమలో టీడీపీని బలహీన పరిచేందుకే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫరూక్‌ అన్నారు.

Tags

Next Story