హిందూపురం పర్యటనలో బాలక‌ృష్ణ.. వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం

హిందూపురం పర్యటనలో బాలక‌ృష్ణ.. వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం

అనంతపురం జిల్లా హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజల పర్యటన కోసం సొంత నియోజకవర్గానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అతడి కారుకు అడ్డుపడి బాలయ్య గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అనుకుంటే టీడీపీ ఎందుకు వ్యతిరేస్తోందని నిలదీసి ఆందోళనకు దిగారు. అయితే బాలకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story