విశాఖలో భూసేకరణ పేరుతో.. భూకుంభకోణం జరుగుతోంది: టీడీపీ నేత పట్టాభి
విశాఖలో భూసమీకరణ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు టీడీపీ నేత పట్టాభి. వైసీపీ 420 గ్యాంగ్‌కి దోచిపెట్టడానికి విశాఖలో 5వేల ఎకరాలు సిద్ధం చేశారని అన్నారు. విశాఖపై వైసీపీ నేతలది కపట ప్రేమ అని.. భూముల మీద ప్రేమతోనే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. అమరావతి భూములతో పాటు విశాఖలో భూముల స్కాంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు పట్టాభి.
భూసమీకరణ పేరుతో 2400 ఎకరాలను భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు పట్టాభి. విజయసాయి, బొత్స సహా వైసీపీ నాయకులందరు విశాఖలో భూములు కొట్టేసే ప్లాన్‌కు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. మీరిచ్చిన జీవోల ద్వారానే అడ్డంగా దొరికిపోయారన్నారు పట్టాభి.
విశాఖ చుట్టు పక్కల అసైన్డ్ భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు పట్టాభి. పేదలకు పట్టాలు ఇచ్చే పేరుతో పేదల పొట్ట కొడతారా అని మండిపడ్డారు. దమ్ముంటే 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com