25కు పైగా గుండెలు ఆగినా.. ప్రభుత్వం స్పందించడం లేదు: లోకేష్

25కు పైగా గుండెలు ఆగినా.. ప్రభుత్వం స్పందించడం లేదు: లోకేష్

ఏపీలో ప్రభుత్వ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ నిప్పులు చెరిగారు. తెనాలిలో రాజధాని రైతులకు మద్దతుగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. రాజధాని రైతులు 49 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అమరావతి కోసం ఇప్పటి వరకు 25కు పైగా గుండెలు ఆగినా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉద్యమం చేస్తున్న మహిళలపైనా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. స్టేషన్‌కు వెళ్తే.. పేరేంటి.. కులమేంటని ప్రశ్నిస్తున్నారని.. ఇకపై ఎవరైనా అలా అడిగితే మన కులం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుదామని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

Tags

Next Story