అసెంబ్లీకి అడ్డ దారిలో వెళ్లే సీఎం.. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే: అయ్యన్న పాత్రుడు

X
ఈ రోజు విశాఖ నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్క ఆనంద్‌బాబు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసెంబ్లీకి దొడ్డిదారిన వెళ్లే సిఎం జగన్మోహనరెడ్డి.. కోర్టుకు మాత్రం దర్జాగా రాజమార్గంలో వెళుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
