అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: బోండా ఉమా

అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: బోండా ఉమా

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరిగితే టీడీపీకి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు బొండా ఉమ. ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదన్నారాయన. అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందన్న ఆయన.. అవినీతి మరకలను టీడీపీ, చంద్రబాబుకు అంటించాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ రైడ్స్‌ జరితే.. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ ప్రచారం చేస్తోందంటూ విమర్శించారు. జైలు జీవితం నుంచి తప్పించుకునేందుకే జగన్‌ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారన్నారు బొండా ఉమా. మోదీ కాళ్లు, అమిత్‌షా కాళ్లు పట్టుకునేందుకే జగన్‌ ఢిల్లీ పర్యటన చేస్తున్నారన్నారు. బెయిల్‌ రద్దు అయితే.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందన్నారు. కేంద్రం మెడలు వంచుతానన్న గన్‌.. ఢిల్లీకి వెళ్లి తన మెడలు వంచుతున్నారన్నారు.

Tags

Next Story