వైసీపీ భాష మనకొద్దు.. ఆ పాలన గురించి ప్రజలకు తెలియజేయండి: లోకేష్

వైసీపీ భాష మనకొద్దు.. ఆ పాలన గురించి ప్రజలకు తెలియజేయండి: లోకేష్

ఎవరైనా మీ నాన్న ఎవరని తెలుగులో అడుగుతారని, కానీ.. వైసీపీ మంత్రుల భాష చాలా దారుణంగా ఉంటుందన్నారు నారా లోకేష్‌. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన.. సోషల్‌ మీడియాలో మనకు వైసీపీ భాష అవసరం లేదన్నారు లోకేష్‌. తుగ్లక్‌ పాలన గురించి ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడండి చాలు అన్నారు. చంద్రబాబు హయంలో రాష్ట్ర యువతకి దాదాపు 10 లక్షల ఉద్యోగలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆనాడే చేసి చూపించామన్నారు.

జగన్‌ వస్తే వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు వచ్చాయన్నారు లోకేష్‌. యూనివర్శిటీలను రాజకీయ వేదికగా మార్చేశారని.. ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఉన్న ఉద్యోగాలు, కంపెనీలు పోయాయన్నారు లోకేష్‌. కియా యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీ బెదిరించారని, అందుకే వాళ్లు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నారు.

Tags

Next Story