విశాఖలో తలెత్తిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన టీడీపీ

విశాఖలో తలెత్తిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన టీడీపీ

విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు.. పార్టీ నేతలతో చంద్రబాబు.. టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడం ఏమిటని చంద్రబాబు అన్నారు. పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టులోకి ఎలా రాగలిగారని చంద్రబాబు ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ దాడులు చేశారనేది స్పష్టమైందని బాబు అన్నారు. విశాఖలో పర్యటించి తీరుతామని.. ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు.

విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై టీడీపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై మధ్యాహ్నం కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.

గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం వాదనలు జరిగే ఛాన్స్ ఉంది. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా విశాఖ చేరుకున్న చంద్రబాబును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ముందస్తు అనుమతి తీసుకున్నా.. వైసీపీ కార్యకర్తల్ని నిలువరించడంలో పోలీసుల వైఫల్యం చెందారు. దీంతో రోజంతా విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Next Story