లోకేష్‌ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

లోకేష్‌ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేష్ ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ర్యాలీ రాజానగరం నియోజకవర్గం మునికూడలి వద్దకు రాగానే.. లోకేష్‌ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించారు. టీడీపీ నేతలపై కుర్చీలు విసిరారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అంతకుముందు, రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ నుంచి కాతేరు మీదుగా బొబ్బర్లంక వరకు ర్యాలీ నిర్వహించారు లోకేష్‌. భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజానగరం, రఘుదేవపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Tags

Next Story