తమిళనాడు నుంచి మద్యం, డబ్బు తీసుకొని వచ్చారు: చంద్రబాబు

తమిళనాడు నుంచి మద్యం, డబ్బు తీసుకొని వచ్చారు: చంద్రబాబు

రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు స్థానిక ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు చట్టపరంగా ఎందుకు తగ్గించారో జగన్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అభ్యర్థులను పోటీచేయకుండా బెదిరిస్తున్నారని.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదలపై తర్వాత వార్డుల డీలిమిటేషన్‌ కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఇందుకోసం తమిళనాడు నుంచి భారీగా మద్యం, డబ్బు తీసుకొచ్చారని ఆరోపించారు.

వైసీపీ ఎన్నికల నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి పలు వీడియోలు ప్రదర్శించారు. పంచాయితీ రాజ్‌ శాఖామంత్రి నియోజకవర్గంలోనే ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. సీఎం ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా రిజర్వేషన్లు చేసి బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు బాబు.

తమ అభ్యర్ధుల్ని జైల్లో పెట్టినా.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు చంద్రబాబు. నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఇంట్లో కూర్చోవడంతో ఎన్నికల సంఘం పని అయిపోయినట్లు కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు కోరారు

Tags

Next Story