కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ

కర్నూల్‌ జిల్లా మంత్రాలయం మండలం కోసిగిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. నామినేషన్లు దాఖలు చేయడానికి టీడీపీ, వైసీపీ నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డిలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో ఎస్పీ సూచనల మేరకు ఇద్దరు నేతల నామినేషన్‌ కార్యక్రమానికి సీఐ నిరాకరించారు. ఘర్షణలు జరగకుండా టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో తామే నామినేషన్లు వేయిస్తామని నేతలకు పోలీసులు సూచించారు.

Tags

Next Story