ఆంధ్రప్రదేశ్

ఏపీలో కరోనా కలకలం

ఏపీలో కరోనా కలకలం
X

ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కర్నూలులోని ఐసోలేషన్‌ వార్డులో మహిళలకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఆమె జెరూసలేం యాత్రకు వెళ్లి వచ్చింది. దగ్గు అధికంగా ఉండడంతో కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో పరీక్షలు చేసి.. తరువాత ఆమెను మెరుగైన చికిత్స కోసం పంపారు.

మరోవైపు నెల్లూరును కరోనా భయపెడుతోంది. 14 రోజుల కిందట ఇటలీ నుంచి వచ్చి ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఉన్న బాధితుడు గత నాలుగు రోజులుగా నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు.. అతనికి కరోనా వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు.

కరోనా ఉందా లేదా అని నిర్ధారించేందుకు రెండో విడత పరీక్షల కోసం బాధితుడి రక్త నమూనాలను పూణె పంపించారు. ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులోని చిన బజారులో నివసిస్తున్న బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Next Story

RELATED STORIES