నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ కార్యకర్తలు దాడి

నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ కార్యకర్తలు దాడి

గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే టీడీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. నర్సరావుపేటలో నామినేషన్‌ వేయడానికి వస్తున్న టీడీపీ అభ్యర్థులపై మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Tags

Next Story