ఏపీలో కొనసాగుతున్న వైసీపీ దౌర్జన్యకాండ
ఏపీలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండ పీక్ స్టేజ్‌కు చేరింది. అధికారం అండ చూసుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. కుదిరితే బెదిరింపులు.. లేదంటే దాడులు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు. వరుసగా జరుగుతున్న అరాచకలు చూస్తుంటే అసలు ఏపీలోనే ఉన్నామా, లేక బీహర్, యూపీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. చట్టం అంటే గౌరవం లేదు. కోర్టులంటే లెక్కలేదు. రాజ్యాంగానికి విలువలేదు. పోలీసు వ్యవస్థనూ భ్రష్టుపట్టించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ఇంత దౌర్జన్యమా? ఇంద బీభత్సమా? ఇంత బరితెగింపా? అంటూ విపక్షాలు ప్రభుత్వంపై విచుకుపడుతున్నాయి.
గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటన వైసీపీ శ్రేణుల అరాచకానికి పరాకాష్ట. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దా? వైసీపీ వాళ్లు మాత్రమే నామినేషన్లు వేయాలా? పోటీ అనేదే ఉండకూడదా? ఇది వైసీపీ రాజ్యాంగమా? 90 శాతం స్థానాలు గెలవాలని సీఎం జగన్ హుకూం జారీ చేశారు సరే.! లేదంటే పదవులు ఊడుతాయని హెచ్చరించారు సరే. అలాగని ఇంతగా బరితెగిస్తారా? అసలు ప్రత్యర్థి పార్టీల వాళ్లను నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టిస్తే పోటీ అనేదే లేకుండానే గెలువచ్చన్నది వైసీపీ వ్యూహామా? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు ఇలాంటి ఆదేశాలే వెళ్లాయా? అందుకే ఇంతలా రెచ్చిపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.
ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ప్రాణాలకే దిక్కులేకపోతే ఎలా? మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారుపై జరిగిన దాడి దృశ్యాలు దేనికి సంకేతం. పట్టపగలు.. నడిరోడ్డుపై.. కారుని ఆపి రాళ్లు, కర్రలతో అటాక్ చేస్తే అడిగే నాథుడే లేడా? అంత పెద్ద దుడ్డు కర్ర పట్టుకొని.. కారు అద్దాలు పగలగొట్టి.. లోపల ఉన్న వ్యక్తుల్ని కసిగా కుళ్లబొడుస్తున్నారంటే వాళ్లుకు ఎంత ధైర్యం.? అంత బరితెగింపు వైసీపీ కార్యకర్తలు ఎలా వచ్చింది? తలలు పగిలి రక్తాలు కారుతున్నా.. వదలకుండా బైక్‌లు, కార్లలో చేజ్ చేస్తారా? తృటిలో తప్పించుకున్నారు కాబట్టి సరిపోయింది. ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి జగన్, డీడీపీ గౌతం సవాంగ్ ఏం సమాధానం చెబుతారు?
అసలు ఏపీలో పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు? చివరికి పోలీసులపైనే దాడులు చేస్తున్నా.. స్పందించరా? నామినేషన్ల సమయంలోనే ఇలా ఉంటే.. రేపు పోలింగ్ సమయంలో ఎంకెన్ని అరాచకాలు చేస్తారు? ఇంకెంత భయానక, బీభత్సం సృష్టిస్తారు?
మాచర్ల ఘటనలో దాడికి పాల్పిడిన వ్యక్తి తురక కిషోర్. ఇతడు మాచర్ల వైసీపీ సిటీ యూత్ ప్రెసిడెంట్. ఎలాంటి భయం, బెరుకూ లేకుండా పట్టపగలే అటాక్ చేశాడు. ఇంతవరకు ఈ ఘటనపై పోలీసులు ఎందుకు స్పందిచలేదు..? స్పష్టమైన వీడియో ఎవిడెన్స్ ఉన్నా కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com