జగన్‌కి గెలుస్తామని నమ్మకం లేదా: జీవీఎల్

జగన్‌కి గెలుస్తామని నమ్మకం లేదా: జీవీఎల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలంటే అధికార పార్టీకి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు ఎంపీ జీవిఎల్‌.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదా..? గెలుస్తామన్న నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం జగన్‌ నోరు విప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Tags

Next Story