ఉగ్రవాదులను మించి వైసీపీ వాళ్లు ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం యద్దేచ్చగా కొనసాగుతోందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసులే టెరరైజ్ చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బైండోవర్ కేసుల పేరుతో పోలీసులే బెదిరిస్తారా.. అని ప్రశ్నించారు.
నల్ల జీవోలని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యంపైనే దాడికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాత్రి పూట ఇంట్లోకి వెళ్లి మధ్యం సీసాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతా ఉందా అని ప్రశ్నించారు. పోలీసుల హింసను తట్టుకోలేక చాలా మంది లొంగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి పోలీసులు తెచ్చుకోవద్దన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నిర్వీర్యమైందని చంద్రబాబు అన్నారు. వైసీపీ నామినేషన్లను అన్నివిధాలుగా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల అరచాకాలు ఎన్నికల సంఘానికి కనిపించవా అని ప్రశ్నిచారు. ఉగ్రవాదులను మించి వైసీపీ వాళ్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
RELATED STORIES
Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే...
25 Jun 2022 3:15 PM GMTDraupadi Murmu: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రౌపది ముర్ము...
25 Jun 2022 11:15 AM GMTAmit Shah: విచారణలో భాగంగా నన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు: అమిత్...
25 Jun 2022 9:07 AM GMTDraupadi Murmu: మోదీ, అమిత్ షాలతో ద్రౌపది ముర్ము భేటీ.. నామినేషన్...
23 Jun 2022 11:52 AM GMTShiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..
23 Jun 2022 10:00 AM GMTPublic Provident Fund: పీపీఎఫ్ ద్వారా రూ. కోటి సమకూర్చుకోవాలంటే.....
23 Jun 2022 6:43 AM GMT