ఆంధ్రప్రదేశ్

పోలీసులు సమాధానం చెప్పే రోజు తొందర్లోనే వస్తుంది: చంద్రబాబు

పోలీసులు సమాధానం చెప్పే రోజు తొందర్లోనే వస్తుంది: చంద్రబాబు
X

సీఎం జగన్‌కు ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా అని నిలదీశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని సూచించారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాదా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్‌ ఇంకా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుందని నిలదీశారు. పోలీసుల తీరుపైనా మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో ఖాకీ టెర్రరిజం నడుస్తోందంటూ ఫైరయ్యారు.. పోలీసులు సమాధానం చెప్పే రోజు తొందర్లోనే ఉందన్నారు

Next Story

RELATED STORIES