జగన్‌కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యంపై లేదు: యనమల

X
సీఎం జగన్‌కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తమైతే.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవడంలేదని మండిపడ్డారు. కనీసం సమీక్ష కూడా జగన్ జరపడంలేదని ఆరోపించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి 20శాతానికిపైగా ఏకగ్రీవాలు అయ్యాయంటే అరాచకాలు లేవా అని యనమల ప్రశ్నించారు. కేంద్ర బలగాలతోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
