కరోనా ఎఫెక్ట్.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా సీఎం సహా, మంత్రులు కూడా కేబినెట్ సమావేశంలో సోషల్ డిస్టెన్ష్ పాటించారు.
కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేశామని కేబినెట్ భేటీ తరువాత మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కరోనా వ్యాపించకుండా స్వీయనింత్రణ విధించుకున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని మంత్రి పేర్నినాని కోరారు. క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రండి అన్నారు. తాను స్వయంగా చేతులెత్తి మొక్కుతున్నా.. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఏపీ ప్రజలను కోరారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని.. ఇక్కడి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com