ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 23కు చేరింది. తాజాగా వైరస్ సోకినా ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారని వైద్యులు వెల్లడించారు. వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాక ఇంట్లోనే ఉండగా.. అనారోగ్యం కారణంతో 29న రాజమండ్రి ఆస్పత్రిలో చేరారు. కానీ.. మరో వ్యక్తి సామర్లకోట, పిఠాపురం ప్రాంతాల్లో పలు మసీదుల్లో స్నేహితులతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అనంతరం వ్యాధి లక్షణాలు కనిపించడంతో కాకినాడ ఆస్పత్రిలో చేరారు. వీళ్లిద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

Tags

Next Story