ఆంధ్రప్రదేశ్

ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. 132కు చేరిన పాజిటివ్ కేసులు

ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. 132కు చేరిన పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో 132కు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చేరింది. కేవలం 12 గంటల వ్యవధిలో 21కొత్త కేసుల నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అధికంగా 20 చొప్పున కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 కేసులు చొప్పున నమోదయ్యాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 14 విశాఖ జిల్లాలో 11, తూర్పుగోదావరిలో 9, చిత్తూరులో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. తక్కువగా అనంతపురంలో 2, కర్నూలులో 1 కేసు నమోదయ్యాయి. ఇక.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Next Story

RELATED STORIES