వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు ఇవ్వలేకపోతున్నారు: నారాలోకేష్

వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు ఇవ్వలేకపోతున్నారు: నారాలోకేష్

మాజీ మంత్రి నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు ఇవ్వలేకపోతున్నారని ట్వీటర్ వేదికగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బాటలోనే వైసీపీ నేతలు నడుస్తున్నారని.. ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారని లోకేష్ విమర్శించారు. ఎంతో మంది దాతలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా.. అరకొర నిధులు విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. కరోనా నివారణకు నిధులు లేవని అధికారులు లేఖలు రాసే పరిస్థితి ఏర్పడిందని లోకేష్‌ అన్నారు.

Tags

Next Story