ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి కరోనా

ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి కరోనా
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం కూడా కరోనాపై యుద్ధానికి పలు నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. తాజాగా కరోనా కట్టడికి భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కరోనాకు సంబంధించిన వైద్య పరీక్షలను, చికిత్సలను ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కిందకు తీసుకొచ్చింది. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లు, ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేసుకునే అవకాశం కలుగుతుందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ తెలిపింది.

కరోనా చాప కింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పరిధిలో ఉన్న 50 కోట్ల మంది.. ప్రైవేటు ల్యాబ్‌లు, ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల మేరకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏ తెలిపింది.

Tags

Next Story