ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
X

తాజాగా నమోదైన కరోనా కేసులకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. విశాఖలో 5, అనంతపురం, కర్నూలు జిల్లాలో చెరో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అటు గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 266కి పెరిగింది. కర్నూలు జిల్లాలో అధికంగా 56 కేసులు నమోదు కాగా.. అనంతపురం తక్కువగా 6 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. మరోవైపు.. 5గురు బాధితులు రికవరీ అయి.. డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం తెలిపింది

Next Story

RELATED STORIES