ఏపీలో కరోనాతో ఓ వ్యక్తి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..

ఏపీలో కరోనాతో ఓ వ్యక్తి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. తాజాగా మరొకరు కరోనాతో మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఈ నెల 3న మరణించాడు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించించింది. దీంతో ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4 కి చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఇద్దరు మృతి చెందారు. అటు.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 304 కి చేరాయి.

Tags

Next Story