ఐసోలేషన్ కేంద్రాల నుంచి రోగులు పారిపోతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

ఐసోలేషన్ కేంద్రాల నుంచి రోగులు పారిపోతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

కరోనా వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు.. కన్నా లేఖ రాశారు. కరోనా మహమ్మారి వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని. ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి రోగులు పారిపోతున్నారని లేఖలో తెలిపారు. ఐసోలేషన్‌ కేంద్రాల్లో వసతులను మెరుగుపర్చాలని కోరారు. వైద్య సిబ్బందికి.. తగిన వ్యక్తిగత సామాగ్రి ఏర్పాటు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

Tags

Next Story