భారత్‌లో 24 గంటల్లో 773 పాజిటివ్ కేసులు

X
గడిచిన 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు.. భారత్‌లో కరోనా ప్రభావంపై కేంద్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 24 గంటల్లో 773 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 149 మంది మరణించారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరింది. అటు.. 402 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభత్వం వెల్లడించింది. భారత్‌లో హైడ్రాక్సిక్లోరోక్విన్‌కు కొరత లేదని వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
