ఈ సమయంలో ఎన్నికల గురించి ఆలోచించడమేంటి?: చంద్రబాబు

X
టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ అధికారులతో చర్చిస్తున్నట్టు పత్రికల్లో వస్తున్న వార్తల పై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలా అంటూ ప్రశ్నిస్తూ ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాటం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించడం ఏంటి అనిమండిపడ్డారు. గత అనుభవాలను నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని.. రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
