ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 44 కరోనా కేసులు.. కర్నూల్ లో ప్రమాద ఘంటికలు

ఏపీలో కొత్తగా 44 కరోనా కేసులు.. కర్నూల్ లో ప్రమాద ఘంటికలు
X

ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల్లో గత 24 గంటల్లో కర్నూల్ లో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. అటు రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 647కు చేరుకుంది. ఇప్పటివరకు 17 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. 65 మంది డిశ్చార్ అయ్యారు.

కాగా కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు నమోదవ్వగా.. కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5 నమోదయ్యాయి. అటు గుంటూరు, అనంతపురం జిల్లాలో చేరో 3 చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Next Story

RELATED STORIES