భారత్‌లో కరోనా ప్రభావం.. ఆందోళనకరంగా మహారాష్ట్ర

భారత్‌లో కరోనా ప్రభావం.. ఆందోళనకరంగా మహారాష్ట్ర
X

భారత్ లో కరోనా ప్రభావం రోజు రోజజుకు పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా రోగుల సంఖ్య 15 వేలు దాటింది. అటు.. కరోనాతో 507 మంది చనిపోగా.. 2231 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదైన రాష్ట్రాలు 5 ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి.

మహారాష్ట్ర పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు 3651 మంది కి కరోనా సోకగా.. 211 మంది కరోనాతో మృతి చెందారు. తరువాత ఢిల్లీలో 1,893 కేసులు నమోదవ్వగా.. 42 మంది చనిపోయారు. అటు.. మధ్యప్రదేశ్‌లో 1407 మందికి కరోనా సోకగా.. 70 మంది చనిపోయారు.

తరువాత తమిళనాడు, రాజస్థాన్‌లో వరుసగా 1372, 1351 కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులో 15 మంది మృతిచెందగా.. రాజస్థాన్‌లో 11 మంది చనిపోయారు.

తెలుగు రాష్టాలలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. రెండు రాష్ట్రాలలో కలిపి కరోనా కేసులు సంఖ్య 1500లకు చేరువలో ఉన్నాయి.

Tags

Next Story