ఆంధ్రప్రదేశ్

ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 75 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 75 పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్ ద్వారా వివరాలు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 722 కి చేరుకుంది. కాగా ఇప్పటివరకు 92 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 20 మంది మరణించారు.

తాజాగా నమోదైన కేసుల్లో అధికంగా 25 కేసులు చిత్తూరులోనే నమోదయ్యాయి. తరువాత గుంటూరులో 20, కర్నూల్ లో 16 కేసులు నమోదయ్యాయి. అటు కృష్ణ జిల్లాలో 5, అనంతపురంలో 4, కడప 3, తూర్పుగోదావరిలో 2 నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES