మన జీవిత కాలంలో అతిపెద్ద యుద్ధమిది: రాజ్‌నాథ్ సింగ్

కరోనా మహమ్మారి ప్రభావం పడకుండా రక్షణ రంగంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రక్షణ దళాల కదలికలను వీలైనంత తగ్గిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సెలవులను తగ్గించి.. వర్క్‌ఫ్రం హోం లాంటి చర్యల వలన రక్షణ దళాల ప్రయాణాలు తగ్గించామని ఆయన తెలిపారు. ఢిఫెన్స్ కంపెనీలు ఎన్ - 95 మాస్కులు, పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్‌ను తయారు చేస్తున్నాయని, ప్రభుత్వ ఆదేశానుసారం త్రివిధ దళాలూ పనిచేస్తూనే ఉన్నాయని తెలిపారు.
అటు.. కరోనాతో మనమంతా కనిపించని యుద్ధం చేస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన జీవిత కాలంలో ఇది అతిపెద్ద యుద్ధమని అన్నారు. ఈ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ యుద్ధ ప్రాతిపదికన పోరాడుతోందని.. అన్ని శాఖలు ఐక్యంగా పనిచేస్తున్నాయని.. అందుకే కరోనా కట్టడిలో భారత్ చాల ముందుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com