ఆంధ్రప్రదేశ్

మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు

మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలు చేస్తున్న వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో వారికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5 వేలు ఇవ్వాలని మంగళవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గుర్తింపు ఉన్న మసీదుల్లో వారికే కాకుండా.. గుర్తింపు పొందని వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story

RELATED STORIES