ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశం

X
కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై సమీక్ష జరిపిన జగన్ ఈ మేరకు ఆదేశించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, జవహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కర్నూలు జీజీహెచ్‌ను కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించారు.
కాగా.. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రము మొత్తం 757 కేసులు నమోదవ్వగా.. ఈ నాలుగు జిల్లాలలో 492 కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
