ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో ముగ్గురికి కరోనా పాజిటివ్.. రాష్ట్రం మొత్తం 1016 కేసులు

శ్రీకాకుళంలో ముగ్గురికి కరోనా పాజిటివ్.. రాష్ట్రం మొత్తం 1016 కేసులు
X

ఏపీలో కరోనా వేగం పెరుగుతుంది. శనివారం కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు కరోనా నుంచోయ్ కోలుకొని 171 మంది డిశ్చార్జ్ అవగా, ఈ కరోనా మహమ్మారి దాటికి 31 మంది చనిపోయారు.

అటు తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణ జిల్లాలో 25 కరోనా కేసులు నమోదు అవగా కర్నూలులో 14, అనంతపురంలో 5, కడప, నెల్లూరులో నాలుగు చొప్పున నమోదయ్యాయి. అటు తూర్పు గోదావరిలో గుంటూరులో శ్రీకాకుళం జిల్లాలలో 3 చొప్పున నమోదయ్యాయి.

అయితే.. ఇప్పటి వరకు కేసులు లేవు అనుకున్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

RELATED STORIES