భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేట్

భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేట్
X

భారత్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గురువారం వరకు 20 శతం లోపే ఉన్న రికవరీ రేటు.. ఇప్పుడు 20.37కు చేరింది. గత 24 గంటల్లో 1684 కొత్త కేసులు నమోదయ్యని.. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23077కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే.. ఇప్పటివరకూ 718 మంది చనిపోగా.. 4749 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం పెరుగుతుంది.

Tags

Next Story