ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత

X
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది. దేశంలో లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభు త్వాలు వెల్లడించాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తోంది ఏపీ సర్కార్. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం పూర్తి పింఛన్లు అందిస్తామని పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
