కరోనా టెస్ట్ చేయించుకున్న ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స

X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఇక ఏపీలో ఈ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. రోజు రోజుకీ కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా భయంతో నేతలు కోవిడ్ 19 టెస్టులు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వచ్ఛందంగా కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా మంత్రికి వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో నెగెటివ్‌గా నిర్థారణ అయిందని బొత్స తెలిపారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ర్యాపిడ్ కిట్ల సహాయంతో తనకు కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
