ఆంధ్రప్రదేశ్

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా మరో 62 కేసులు

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా మరో 62 కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కట్టడి కావటంలేదు. ఈ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో మరో 62 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 33 మంది చనిపోయారు. ఇక ఇంకా 1051 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూల్ లో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. ఇక కృష్ణలో 12, నెల్లూరులో 6 కేసులు బయటపడ్డాయి. అటు, విశాఖ, అనంతపురం,కడప జిల్లాల్లో 4 చొప్పున నమోదవ్వగా.. తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES