గడిచిన 24 గంటల్లో 1074 మంది కోలుకున్నారు: లవ్ అగర్వాల్

గడిచిన 24 గంటల్లో 1074 మంది కోలుకున్నారు: లవ్ అగర్వాల్
X

భారత్ లో గడిచిన 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు చేరిందని కేంద్రం ప్రకటించింది. అటు, గడిచిన 24 గంటల్లో 1074 మంది కోలుకున్నారని.. ఇప్పటివరకు ఇంట ఎక్కువగా కోలుకోవడం ఇదే మొదటి సారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 11706 మంది పూర్తిగా కోలుకున్నారని.. రికవరీ రేటు 27.52 శాతం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Tags

Next Story