ఆంధ్రప్రదేశ్

ఏపీ మెడ్‌టెక్ జోన్‌కి కరోనా సెగ

ఏపీ మెడ్‌టెక్ జోన్‌కి కరోనా సెగ
X

కరోనా టెస్ట్‌లకు అవసరమయ్యే ఎక్విప్మెంట్‌ తయారు చేసే ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌కి కరోనా సెగ తలిగింది. ఈ నెల 4 న మెడ్‌ టెక్‌ జోన్‌లో జరిగిన ఇంటర్య్వూకి కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తి హాజరు కావడంతో కలకలం రేగింది. గాజువాక, వడ్లపూడికి చెందిన ఇతను కొంతకాలం క్రితమే ఖతర్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న ఇంటర్వ్యూ కోసం ఇతను మెడ్‌టెక్‌ జోన్‌కు వచ్చాడు. ఆ మరుసటి రోజే. అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇతను రోజంతా.. మెడ్‌టెక్‌ జోన్‌లో గడిపినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడన్న వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. లాక్‌డౌన్‌ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్వ్యూలు నిర్వహించడంతో ఉద్యోగులంతా ప్రమాదం పడ్డారు. కరోనా బాధితుడు ప్రస్తుతం గీతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు అధికారులు.

Next Story

RELATED STORIES