ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజ‌ృంభణ.. కొత్తగా 38 కేసులు

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజ‌ృంభణ.. కొత్తగా 38 కేసులు
X

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదనట్టు.. ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 వేల 18కి చేరింది. 7 వేల 409 శాంపిల్స్ పరీక్షించగా... 38 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. 2 వేల 18 కేసుల్లో... 998 మంది డిశ్చార్జ్‌ కాగా... 45 మంది చనిపోయారు. ప్రస్తుతం 975 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తొమ్మిదేసి కేసులు నమోదవగా... అనంతపురం 8, గుంటూరు 5, కృష్ణా-విశాఖలో చెరో మూడు, నెల్లూరు జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. తూర్పుగోదావరి, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన 9 కేసుల్లో... 8 కేసులకు తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ లింక్‌లున్నట్టు గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే... అత్యధికంగా కర్నూలు జిల్లాలో 575 మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 387, కృష్ణా - 342, చిత్తూరు- 121, అనంతపురం -114, నెల్లూరు -102, కడప-97, పశ్చిమగోదావరి - 68, విశాఖ -66, ప్రకాశం-63 తూర్పుగోదావరి జిల్లా 46, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ap corona...

Next Story

RELATED STORIES