భారత్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్‌

భారత్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్‌

కరోనా సంక్షోభ సమయంలో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. కరోనాపై పోరాటానికి బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. అంటే, సుమారు 7 వేల 5 వందల కోట్లు ప్రకటించింది. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గతంలో వరల్డ్ బ్యాంక్ ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు మరో బిలియన్ డాలర్లు ప్రకటించింది. మొత్తంగా 2 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆరోగ్య భధ్రతకు సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్‌. కరోనా​ సంక్షోభం, లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద ఈ నిధులు కేటాయించారు. భారత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్య క్రమాలకు ఈ ఆర్థిక ప్యాకేజీని లింక్ చేశారు. దేశంలో అమలు చేస్తున్న 4 వందలకు పైగా సామాజిక భద్రతా పథకాల అమలుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌పై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. విధానపరంగా ఈ పథకం చాలా ముఖ్యమైందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ప్రజల ఆరోగ్యా నికి, జీవనోపాధికి భారత ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. క్యాష్ ట్రాన్స్‌ఫర్ల విధానం చాలా కీలకమైందని, ఆ పద్ధతితో ప్రజల జీవన ప్రమాణాలు చాలా వేగంగా-సులువుగా అభివృద్ధి చెందుతాయని తెలిపింది. భార‌త ప్రభుత్వంతో మూడు రంగాల్లో భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకుంటామని వ‌ర‌ల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఆరోగ్యం, సామాజిక సంర‌క్షణ‌, చిన్న-మధ్యత‌ర‌హా ప‌రిశ్రమ‌ల కోసం నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. పట్టణ పేదల్లో సామాజిక భద్రతను పెంపొందించడా నికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story