ఆంధ్రప్రదేశ్

నిజాలు బయటపెట్టిన డా. సుధాకర్‌ను వేధిస్తున్నారు: నారాలోకేష్

నిజాలు బయటపెట్టిన డా. సుధాకర్‌ను వేధిస్తున్నారు: నారాలోకేష్
X

సీఎం జగన్‌ది క్రూరమైన మనస్తత్వమని, మాస్కులు ఇవ్వమని వేడుకున్న డాక్టర్‌ సుధాకర్‌ని నియంతలా సస్పెండ్‌ చేశారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఈ మేరకు ట్వీట్‌ చేశారు లోకేష్‌. ఓ దళిత డాక్టర్‌ని తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్‌ ఉన్మాదానికి పరాకాష్ట అన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు లోకేష్‌. దళితులను జగన్‌ దారుణంగా అవమానిస్తున్నారని, నిజాలు బయటపెట్టిన వైద్యుడైన సుధాకర్‌పై కక్ష కట్టి వేధిస్తున్నారన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు లోకేష్‌.

Next Story

RELATED STORIES