టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడి దాడి

టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడి దాడి
X

విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కార్యకర్తపై ఓ వైసీపీ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామానికిచెందిన గంగాధర్ పై... వైసీపీ కార్యకర్త, వాలెంటీర్ శెట్టి వెంకటరమణ దాడిచేశాడు. ఈ దాడిలో గంగాధర్ తీవ్రంగా గాయపడి చేతివిరి ఆస్పత్రిపాలయ్యాడు. వైసీసీ కార్యకర్త వెంకటరమణ ఆ గ్రామానికి చెందిన 2.96 ఎకరాల చెరువు గర్భం ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గంగాధర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి గంగాధర్ పై కక్షకట్టిన వెంకటరమణ, రాత్రిపూట దారికాసి దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితున్ని ఇంతవరకు అరెస్టుచేయలేదు.

Tags

Next Story