భారత్‌లో కరోనా కేసులతో పాటు పెరుగుతున్న రికవరీ రేటు

భారత్‌లో కరోనా కేసులతో పాటు పెరుగుతున్న రికవరీ రేటు
X

దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు విఫరీతంగా పెరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి వరుసగా 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పదిరోజుల్లో ప్రపంచ కరోనా కేసుల్లో 11వ స్థానం నుంచి ఏడవ స్థానంకు భారత్ వచ్చింది. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, కరోనా రికవరీ రేటు కూడా ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా ఉంది. 48.19శాతం మంది ఇప్పటికే కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ 2,07,615 కరోనా కేసులునమోదవ్వగా.. ఇంకా.. 1,01,497 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా..అటు కరోనాతో ఇప్పటి వరకూ 5,815 మంది మృతి చెందారు.

Tags

Next Story