జులై చివరి నాటికి దేశంలో 10 లక్షల కేసులు..

జులై చివరి నాటికి  దేశంలో 10 లక్షల కేసులు..
X

లాక్డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా అంచనాల ప్రకారం జులై చివరి నాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని అంటున్నారు. జులై చివరి కల్లా ఒక్క ఢిల్లీలోనే 5.5 లక్షల కేసులు వెలుగు చూస్తాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా విజృంభించనుంది. జులై నెలాఖరు నాటికి 8 నుంచి 10 లక్షలకు పెరగొచ్చు అని శివనాడార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య తెలిపారు. రాజధాని ఢిల్లీలో సుదీర్ఘ లాక్డౌన్ విధించినా కరోనా వ్యాప్తి పెరిగింది. అందులోనూ చాలా కేసుల్లో వారికి ఎలా వైరస్ సోకింది అనేది అర్థం కాకుండా ఉంది అని కోల్ కతాకు చెందిన సీఎస్ఆర్-ఐఐసీబీ శాస్త్రవేత్త ఉపాసన రే పేర్కొన్నారు.

Tags

Next Story