ఏపీలో కేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణం.. రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణం.. రోజా సంచలన వ్యాఖ్యలు
X

నగరి MLA, APIIC ఛైర్ పర్సన్ రోజా కరోనా కేసుల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణమంటూ తప్పు అటువైపు నెట్టేశారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు చేయడం లేదని, పాజిటివ్ కేసులు నమోదైనా వారిని పట్టించుకోకుండా తరిమేస్తున్నారని అన్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న వారి వల్ల ఇక్కడ కేసులు పెరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే అడ్డుకోవాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టింగ్ కియోస్క్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన రోజా.. ఇలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఏపీలో వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పకుండా.. పక్క రాష్ట్రాల ప్రభుత్వాల్ని తిట్టడం విమర్శలకు తావిచ్చింది.

Tags

Next Story