చట్ట వ్యతిరేక పనులకు అధికారులు వత్తాసు పలకొద్దు: టీడీపీ పట్టాభి

చట్ట వ్యతిరేక పనులకు అధికారులు వత్తాసు పలకొద్దు: టీడీపీ పట్టాభి
X

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. తమ కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఈ నెల 10న అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసి 12న అరెస్ట్ చేశారని.. ఒకే రోజులు విచారణ ఎలా పూర్తి చేశారో మంత్రి పేర్నినాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చేస్తున్న చట్టవ్యతిరేక పనులకు అధికారులు వత్తాసు పలవద్దని సూచించారు.

Tags

Next Story